
ప్రతీక్ తల్లి ఈ విషయాన్ని తెలియజేసింది. విరి ఇంట ఈ వివాహ వేడుకలు జరిగాయట. ఇటీవలే ప్రియా బెనర్జీ తన ఇంస్టాగ్రామ్ లో కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. సాంప్రదాయమైన పద్ధతిలోనే వీరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు. ప్రతీక్, ప్రియా పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను అతిధులను కూడా షేర్ చేయడం జరిగింది.
బాలీవుడ్ నటుడు ప్రతిక్ కూడా సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్న నటుడు.. బాలీవుడ్ దివంగత నటి స్మిత పాటిల్ కుమారుడే ఇతడి తల్లి ప్రసవ సమస్యల కారణంగా మరణించిందట. ఇక వివాహంలో కూడా తన తల్లిని స్మరిస్తూ ఉన్నారట. హీరోయిన్ ప్రియా బెనర్జీ విషయానికి వస్తే.. 2013లో కిస్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందట.ఈ చిత్రానికి అడవి శేషు స్వయంగా డైరెక్టర్ గా వ్యవహరించారట. ఆ తర్వాత సందీప్ కిషన్ తో జోరు సినిమాలో కూడా నటించింది. అలాగే అసుర వంటి చిత్రాలలో కూడా నటించిన ప్రియా బెనర్జీ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో పలు తమిళ హిందీ వంటి భాషలలో కూడా నటించిందట.