
ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు . అలాంటి ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్తుంది . ప్రభాస్ సాధారణంగా ఎమోషనల్ అవ్వరు. ఏ సందర్భంలోనైనా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు . ప్రభాస్ తాను ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు . అది ఈశ్వర్ సినిమా పూజా కార్యక్రమాల టైం లో.
"యస్.. ఈశ్వర్ సినిమా ఫస్ట్ షాట్ గా ఈశ్వర్ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పాను. వెంటనే కలలో నీళ్లు తిరిగాయి .. నాన్నగారు చేయి పట్టుకొని గట్టిగా కొట్టావురా అంటూ నా సైడ్ ఏదో సక్సెస్ సాధించిన వాడిలా గర్వంగా చూశారు ..ఆ మూమెంట్ ని ఎప్పటికీ మర్చిపోలేను "అంటూ ఎమోషనల్ అయిపోయారు . ప్రభాస్ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అదే అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రభాస్ చెప్పిన మాటలు తాలూకా వీడియో మరొకసారి వైరల్ గా మారింది. మొత్తానికి ప్రభాస్ అందరికి ఓ రోల్ మోడల్ గా నిలిచాడు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న కష్ట్పడి పైకి రావాలి అంటే టాలెంట్ ఇంపార్టెంట్ అని చెప్పకనే చెప్పేశాడు..!