కోడి రామకృష్ణ డైరెక్షన్లో ప్రేమ, వనిత, భానుచందర్, సిజు లు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా దేవి.ఎమ్మెస్ రాజు నిర్మాతగా చేసారు.అయితే ఈ సినిమా గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు నటుడు దర్శకుడు అయినటువంటి దేవి ప్రసాద్.ఈ సినిమాలోని పాము కారణంగా ఒక బాలుడు మృతి చెందారంటూ ఆయన చెప్పారు.ఇక దేవి సినిమాలో మొత్తం పాముల గురించే స్టోరీ ఉంటుంది. అయితే సినిమాలో పాములు కనిపిస్తే ఆ పాము లో విషం తీయించి తీసుకుంటారు. కానీ ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం వాడిన పాముకి విషం తీసినప్పటికీ బాలుడి ప్రాణం తీసిందట. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమా పుట్టలో నుంచి పాము వచ్చి నటి వనితకు నుదుటిపై బొట్టు పెట్టే సన్నివేశం ఉంటుంది. ఈ సీన్ చేసే సమయంలో పాము కాటు వేయడంతో రక్తం వచ్చిందట. అయితే ఆ పాముకి విషం లేకపోవడంతో ప్రమాదం తప్పింది.ఇక వనిత భాను చందర్ ఇద్దరూ బెడ్రూంలో ఉన్న సమయంలో వారిద్దరి మధ్యలో పాము వస్తుంది.అయితే ఈ సన్నివేశం షూట్ చేయడం కోసం పామును తీసుకువచ్చారు.

అయితే ఆ పాము లోపల విషం తీసివేసినప్పటికీ పాము విషం తీసాక నాలుగు నెలల పాటు సంచిలోనే పెట్టాలట. అయితే ఈ విషయం తెలియని భాయ్ అనే వ్యక్తి దగ్గర పని చేసే మణి అనే కుర్రాడు సంచిలో నుండి పాముని బయటికి తీసారట. అయితే ఆ పాము కోపంతో మణి అనే బాలుడిని నాలుగైదు సార్లు కాటు వేసిందట. కానీ ఇదంతా కామన్.దాంట్లో విషం లేదు నాకేం జరగదు అని షూట్ చేయమని చెప్పారట.ఇక షూట్ అయిపోయాక కిందికి వెళ్లిపోయాడట బాలుడు మణి.ఆ తర్వాత కొద్ది సేపటికే వెళ్లి చూడగా ఆ బాలుడు వాంతులు చేసుకోవడం, చేయి వాచి ఉండటం చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని చెప్పారట.ఇక హాస్పిటల్కి వెళ్లే సమయంలో కూడా నాకేం కాదు ఇదంతా మాకు కామనే అని ఆ బాలుడు అన్నప్పటికీ వినకుండా చిత్ర యూనిట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లింది. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికి మణి అనే బాలుడు పాముకాటుతో మరణించాడు అనే విషయం చెప్పారు.

 దీంతో దేవిశ్రీప్రసాద్ ఎంతగానో బాధపడ్డారట. అలా దేవి సినిమా షూట్ సమయంలో పాము కాటుకు ఒక బాలుడు మృతి చెందాడు అనే సంగతి రీసెంట్గా బయటపెట్టారు దేవి ప్రసాద్. ఇక మరొక విషయం ఏమిటంటే.. పాము కాటుకి గురైన ఆ బాలుడి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదట. చాలా రోజుల నుండి సినిమాలకు పాములను స్వయంగా పట్టే భాయ్ అనే వ్యక్తికి సినిమా స్టూడియో చుట్టూ తిరుగుతున్న ఆ అబ్బాయిని చూసి జాలేసి తన దగ్గర పనికి పెట్టుకున్నాడట. అప్పటినుండి భాయ్ ఆ బాలుడిని చూసుకుంటున్నారట. కానీ దురదృష్టవశాత్తు దేవి సినిమా షూటింగ్ సమయంలో పాము కాటుక గురై ఆ బాలుడు మృతి చెందాడు. ఇక అసలు విషయం ఏమిటంటే పాముకి విషయం తీసేసాక నాలుగు నెలల వరకు దాన్ని సంచిలోనే ఉంచాలట.అయితే ఈ విషయం తెలియని ఆ బాలుడు మణి పామును బయటకు తీయడంతో ఆ విషం పాము లోపలి ఇంకా ఉండిపోవడంతో మణి అనే బాలుడు మృతి చెందాడు

మరింత సమాచారం తెలుసుకోండి: