కన్నడ నటుడు ధనంజయ మరికొద్ది గంటల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు.. సినీ నిర్మాత అలాగే రచయిత కూడా. ధనంజయ 2013లో డైరెక్టర్స్ స్పెషల్ అనే కన్నడ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన నటనతో అందరినీ మెప్పించి, మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ గుర్తింపుతో ధనంజయ పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రలో నటించాడు. హీరోగానే కాదు జాలిరెడ్డి పాత్ర చేసి విలన్ గా కూడా మార్కులు కొట్టేశాడు. అలాగే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి గుర్తింపును సాధించుకున్నాడు.
హీరో ధనంజయ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.  తన ప్రియురాలు ధన్యత మెడలో ముడుమూళ్లు వేయనున్నాడు. ధనంజయ, ధన్యత చాలా కాలంగా ప్రేమించుకుని ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నారు. ఇక ఇటీవలే వీరికి నిశ్చితార్థం అయ్యింది. అయితే ఇప్పటికే పెళ్లి సందడి మొదలయింది. వివాహానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా వారిద్దరినీ పెళ్లికొడుకు, పెళ్ళికూతురు అలంకారంలో ముస్తాబు చేశారు. ఇక వారిద్దరూ ఆ అలంకారంలో కలిసి దిగిన ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. దీంతో అతని మ్యారేజ్ ఫోటో వైరల్ గా మారింది.
ఆ ఫోటోలలో ధన్యతకు, కాబోయే భర్త ధనంజయ గాజులు తొడిగాడు. కాబోయే భార్య కాలికి మెట్టలు కూడా తొడిగాడు. ఇక నేడు వీరిద్దరూ పెళ్లి చేసుకొనున్నారు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల ఆద్వర్యంలో ధనంజయ, ధన్యత వివాహం జరగనుంది. పెళ్లి తర్వాత ఘనంగా రిసెప్షన్ కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలాగే సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? ఏంటి? అని ప్రేక్షకుల మదిలో ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు సుబ్బరాజు భార్య ఎవరు ? ఏం చేస్తుందో ? మనం ఇప్పుడు చూద్దాం. తాను ఒక డాక్టర్ అంట. ఇద్దరిది ప్రేమ వివాహం అంట.

మరింత సమాచారం తెలుసుకోండి: