
అల్లు అరవింద్ నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా తెరకెక్కించే ఓపెన్ ఆఫర్ ఉండటంతో చందూ మొండేటి ఈ రేంజ్ రిస్క్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చందూ మొండేటి ఇప్పటికే హీరో సూర్యను కలిశారని కథకు సంబంధించి చర్చలు కూడా మొదలయ్యాయని సమాచారం అందుతోంది. వాస్తవానికి సూర్య బోయపాటి కాంబోలో సినిమాను తెరకెక్కించాలని అల్లు అరవింద్ భావించారు.
అయితే బోయపాటి శ్రీను అఖండ సీక్వెల్ తో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. గీతా ఆర్ట్స్ వరుసగా 3 సినిమాలను దర్శకత్వం వహించేలా చందూ మొండేటితో ఒప్పందం కుదుర్చుకుందని గతంలో వార్తలు వినిపించాయి. తండేల్ సినిమా సెకండ్ వీకెండ్ ను సైతం బాగానే క్యాష్ చేసుకుంటోంది. కథల ఎంపికలో నాగచైతన్య అదుర్స్ అనిపిస్తున్నారని చెప్పవచ్చు.
అఖిల్ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాలను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. నాగచైతన్య, అఖిల్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. అక్కినేని హీరోల రెమ్యునరేషన్లు ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి. అక్కినేని హీరోలు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా సంచలన విజయాలు సొంతం అవుతాయని చెప్పవచ్చు. చందూ మొండేటి టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రామిసింగ్ డైరెక్టర్లలో ఒకరిగా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ డైరెక్టర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.