
అయితే నాగచైతన్యకు ఈ సినిమా మంచి మార్కులు తెచ్చి పెట్టింది . ఇప్పటివరకు నాగచైతన్య కెరియర్ లో ఇలాంటి ఒక సినిమా అందుకోలేదు అని జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం ఆయన పడ్డ కష్టం అని చెప్పుకోవాలి . కాగా నాగచైతన్య తండేల్ సినిమా సక్సెస్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు . అయితే తండేల్ సినిమా హిట్ అవ్వడంతో అందరూ కూడా నాగచైతన్య ఇక ఇలాంటి లవ్ స్టోరీలే చేస్తాడు అని అనుకున్నారు . ఆయనకి అలాంటి ఆఫర్స్ ఏ వస్తున్నాయట .
కానీ నాగచైతన్య మాత్రం అలా లవ్ స్టోరీసే చేసుకుంటూ పోతే ఆయనకి మాస్ ఇమేజ్ రాదు అని .. ఆ కారణంగానే మాస్ ఇమేజ్ సంపాదించుకోవాలి అని మాస్ కథలను కూడా ట్రై చేయాలి అనుకుంటున్నారట. కచ్చితంగా ఒక లవ్ స్టోరీ పడితే ఆ తర్వాత ఒక మాస్ హిట్ ..ఒక యాక్షన్ ధ్రిల్లర్ మూవీ లాంటివి చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . అలా ముందుకు వెళ్లే విధంగా పక్క ప్లాన్ తో కెరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నారట . సోషల్ మీడియాలో ప్రెసెంట్ నాగచైతన్య తీసుకున్న ఈ డెసిషన్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . నాగచైతన్య డెసిషన్ కరెక్ట్ అయినప్పటికీ ఆయనకు మాస్ ఫాన్ ఫాలోయింగ్ మాత్రం అంత ఈజీగా రాదు అంటున్నారు జనాలు. ఆయన లుక్స్ మాత్రం క్లాస్ గానే సెట్ అవుతాయి అని .. నాగచైతన్య తొడగొట్టి మీసాలు మేలేస్తే జనాలు ఎవ్వరూ చూడరని మాట్లాడుతున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??