సాయి పల్లవి.. ఈ పేరు చెప్తే ముందుగా జనాలు అందరూ కూడా ఒక అద్భుతమైన అందమైన అమ్మాయిని గుర్తు చేసుకుంటారు . సాయి పల్లవి ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  చక్కని చుక్క . అసలు ఏ నెగిటివ్ కోణం కూడా లేని ఒక అందాల ముద్దుగుమ్మ . తన పని తాను చేసుకునిపోతూ ఉంటుంది . ఈ మాట ఒకరు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ ఆమెతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సాయి పల్లవి మంచితనం గురించి మాట్లాడుతూ వస్తారు . బ్యాక్ టు బ్యాక్ "అమరన్-తండేల్" సినిమాతో  సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న సాయి పల్లవికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.


సాయి పల్లవి ఏ సబ్జెక్టు చూస్ చేసుకున్న అది హిట్ అవ్వాల్సిందేనని సాయి పల్లవి ఒక సినిమాకి కమిట్ అయిందంటే .. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయినట్లేదని మాట్లాడుతున్నారు. కాగా చాలా మంది స్టార్ హీరోస్ సినిమాలని కథ నచ్చక సాయి పల్లవి రిజెక్ట్ చేసింది . ఆ విషయం అందరికీ తెలుసు . అయితే అందరిని రిజెక్ట్ చేసే సాయి పల్లవిని ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు . అది కూడా ఒక తెలుగు హీరో . దీంతో అప్పట్లో ఈ హీరో పేరు మారుమ్రోగిపోయింది.



ఆయన మరెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు జనాలు ఇంట్రెస్ట్ గా చూడడానికి ఇష్టపడతారు . కాగా విజయ్ దేవరకొండ నటించిన "ది ఫ్యామిలీ స్టార్" సినిమాలో మొదటగా హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ కన్నా సాయి పల్లవి నే అనుకున్నారట.  అయితే సాయి పల్లవిసినిమా చేస్తుంది అన్న నమ్మకాలు ఎక్కువగా ఉన్న విజయ్ దేవరకొండ మాత్రం నో చెప్పారట . ఎంత ఫామిలీ డ్రామా అయినా కొన్ని కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండాలి .. అలా ఉంటేనే కలిసి వస్తుంది. ఈ సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉంది అది ఖచ్చితంగా ఆమె చేయదు.. అడిగి నో చెప్పించుకోవడం కన్నా మనమే రిజెక్ట్ చేస్తే మంచిది అంటూ నా సినిమాలో సాయి పల్లవి వద్దు అని రిజెక్ట్ చేసేసారట . సాయి పల్లవి ని రిజెక్ట్ చేసిన హీరోగా విజయ్ దేవరకొండ చరిత్రలో నిలిచిపోయాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: