
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి పోటీగా విలన్ షేడ్స్ లో నటించి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు . అలా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో అలరిస్తూ వచ్చిన రానా దగ్గుబాటి ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కాగా మళ్లీ చాలాకాలం తర్వాత ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈసారి తెలుగులో కాకుండా బాలీవుడ్ లో నటించబోతున్నాడట. బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట .
దీనికోసం రానా దగ్గుబాటి చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటూ కూడా తెలుస్తుంది . రానా దగ్గుబాటి కి గతంలో బాలీవుడ్ మూవీస్ నుంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ ఈ బాలీవుడ్ మూవీ చాలా చాలా స్పెషల్ అని విలన్ షేడ్స్ పాత్రలో ఉన్న ఆయనలోని మరొక టాలెంట్ ని కూడా ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు అంటూ ఓ రేంజ్ లోమాట్లాడుకుంటున్నారు జనాలు . మొత్తానికి రానా దగ్గుబాటి ఈజ్ బ్యాక్ అంటూ ప్రూవ్ చేశాడు. చూద్దాం ఈ సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటారు రానా దగ్గుబాటి. దీంతో రానా పేరు మరోసారి వైరల్ గా మారింది..!