రష్మిక మందన్నా.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ బ్యూటీ పేరు మారు మ్రోగిపోతుంది . దానికి కారణం ఆమె బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడమే . మొదటగా "అనిమల్" సినిమాతో కనివిని ఎరుగని బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో - రన్బీర్ కపూర్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన సినిమా "అనిమల్".  ఈ సినిమా ఫుల్ అభిమానులను బాగా ఆకట్టుకునేసింది. దాదాపు 980 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది .


సినిమా తర్వాత పుష్ప2  రిలీజ్ అయింది . సినిమా సూపర్ డూపర్ హిట్ . దాదాపు 1800 కోట్లు క్రాస్ చేసి సినీ ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసింది. మరొక బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . రీసెంట్ గా వచ్చిన "చావా" కూడా బాగా హిట్ అయ్యింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సింపుల్ కాన్ సెప్ట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తుంది . మొదటి రోజే 33 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ రికార్డ్స్ అన్ని మడత పెట్టేసింది.



సినిమా ఖచ్చితంగా భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే మూడు సినిమాలలో రష్మిక నటనకు మంచి  మార్కులు దక్కాయి అని .. ఆమె నటన టాలెంట్ మరింత ముందుకు వెళుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు.  ఇలా రష్మిక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడానికి కారణం ఆమె చూస్ చేసుకునే కధలే అని.. రష్మిక చాలా పక్కాగా తన బాడీకి తగ్గ కధలని చూస్ చేసుకుంటూ ఎక్స్పోజింగ్ అనే రోల్ ని పక్కన పెట్టేస్తుంది అని .. ఆ కారణంగానే రష్మిక మందన్నా ఇప్పుడు ఇలాంటి ఒక క్రేజీ స్థానాన్ని అందుకుంటుంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: