ఏంటి హీరోయిన్ త్రిష వల్ల కేవలం హీరోలు మాత్రమే కాదు ఆ నిర్మాత జీవితం కూడా సంకనాకి పోయిందా.. ఇంతకీ త్రిష వల్ల నాశనం అయిపోయిన ఆ నిర్మాత ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..త్రిష ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి సౌత్లో లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అయితే బాలీవుడ్ లో కూడా ఒకటి రెండు సినిమాల్లో చేసినప్పటికీ అంతగా ఫేమస్ అయితే కాలేదు.దాంతో  సౌత్ లోనే పూర్తిగా నిమగ్నం అయిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ వల్ల ఓ నిర్మాత జీవితం నాశనం అయిందట. మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరయ్యా అంటే..ప్రముఖ నిర్మాత గిరిధర్.. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను త్రిషతో లేడీ ఓరియంటెడ్ హారర్ మూవీ ని తీద్దాం అనుకున్నాను.

డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు.అలా ఈ సినిమాకి మొదట త్రిషకి ఒక రెమ్యూనరేషన్ సెట్ చేశాం. దానికి త్రిష కూడా ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ నాకు రెమ్యూనరేషన్ కోటి రూపాయలు కావాలి అని డిమాండ్ చేసింది. దాంతో తమిళ శాటిలైట్స్ రైట్స్ ఇస్తామని ఎంత చెప్పినా కూడా వినలేదు. దాంతో ఎక్కడ షూటింగ్ కి రాకుండా మానేస్తుందోనని కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చేసాను. అయితే ఈ సినిమా కంటే ముందే త్రిష వేరే సినిమాలో కూడా నటించింది.
 అయితే ఆ సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో ఆ సినిమా రిజల్ట్ నా సినిమా పై పడింది.దాంతో త్రిష నటించిన హారర్ మూవీ నాయకి అతిపెద్ద  డిజాస్టర్ అయింది. ఈ సినిమాకి బడ్జెట్ పెట్టిన నా బతుకు కూడా నాశమైంది అంటూ నిర్మాత గిరిధర్ ఆ ఇంటర్వ్యూలో త్రిష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో నా కెరీర్ పూర్తిగా తలకిందులైంది.అప్పటినుండి నేను నష్టాల్లో కూరుకుపోయాను అంటూ నిర్మాత గిరిధర్ షాకింగ్ కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: