టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రష్మిక భవిష్యత్తు సినిమాలతో సంచలన విజయాలను అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. రష్మిక నటించిన ఛావా సినిమాకు సైతం పాజిటివ్ టాక్ రాగా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా క్రేజ్ కలిగి ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్స్ నెట్టింట నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
వరుసగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక కొన్ని వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాకు అనుగుణంగా లుక్ ను మార్చుకోవడం రష్మిక సక్సెస్ సీక్రెట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రష్మిక మాట్లాడుతూ నేషనల్ క్రష్ లాంటి బిరుదులతో ఎలాంటి ప్రయోజనం దక్కదని చెప్పుకొచ్చారు.
 
సినిమాలలో నటించే బిరుదులు, పేర్లు రియల్ లైఫ్ లో ఉపయోగపడవని ఆమె అన్నారు. అవి ఫ్యాన్స్ ఆదరాభిమానాల వల్ల వచ్చేవి కావని రష్మిక వెల్లడించారు. నా దృష్టిలో అవి కూడా పేర్లు మాత్రమేనని రష్మిక అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నా మంచి కోరేవారిని నేను గుండెల్లో పెట్టుకుంటానని ఈ బ్యూటీ వెల్లడించారు. ఈ రీజన్ వల్లే ఫ్యాన్స్ ఆదరించే సినిమాల్లో నటిస్తున్నానని రష్మిక తెలిపారు.
 
రష్మిక రెమ్యునరేషన్ 4 నుంచి 5 కోట రూపాయల రేంజ్ లో ఉంది. అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని అమె తెలిపారు. ఫ్యాన్స్ కోసం తాను నిద్రకు కూడా గుడ్ బై చెబుతున్నానని రష్మిక చెప్పుకొచ్చారు. రష్మిక వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రష్మిక బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రష్మిక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఓకే చెబితే మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: