
కృష్ణవేణి 1924 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో పంగిడిలో జన్మించింది. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే 1936లో చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టింది కృష్ణవేణి. కృష్ణవేణి తండ్రి ఒక వైద్యుడట. అలా తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తున్న సమయంలోనే మీర్జాపురం రాజుతో పరిచయం ఏర్పడి,ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం జరిగింది. వివాహం అనంతరం బయట సంస్థలలో పనిచేయడం ఇష్టం లేక కృష్ణవేణి సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించింది.
జయ పిక్చర్స్-శోభన అనే స్టూడియో ని కూడా నిర్మించిందట కృష్ణవేణి.. మీర్జాపురం రాజా నిర్మించిన మొదటి సాంఘిక సినిమా జీవనజ్యోతి.. ఇందులో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో నారాయణరావు హీరోగా నటించారు. ఆ తర్వాత పలు చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించింది కృష్ణవేణి.. అలా ఎంతోమంది సీనియర్ హీరోల చిత్రాలలో నటించిన కృష్ణవేణి ఇటీవలే వయోభారం సమస్యతో ఇబ్బంది పడుతూ కొన్ని గంటల క్రితం కన్నుమూసినట్లు ఆమె కూతురు అనురాధ తెలియజేసింది. ఈ విషయం విన్న సినీ సెలబ్రిటీలే కాకుండా అభిమానులు కూడా ఈమె మరణానికి సంతాపం తెలియజేస్తున్నాడు.