
సునీతకు ఎన్నో సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది. అనంతరం అనేక సినిమాలలో పాటలు పాడి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పటికీ సునీత తన గొంతుతో ఎన్నో పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక సునీత సింగర్ గా రాణిస్తున్న సమయంలోనే ఆమె తల్లిదండ్రులు వివాహం చేశారు. ఆ తర్వాత సునీత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఎంతో సంతోషంగా సాగిన సునీత వైవాహిక జీవితం ఏమైందో తెలియదు సింగర్ సునీత తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.
విడాకుల అనంతరం చాలా సంవత్సరాల పాటు తన పిల్లల బాధ్యతలను సునీత ఒక్కరే చూసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత సునీత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సునీత ఎన్నో రకాల నెగిటివ్ ట్రోల్స్ ను ఎదుర్కొంది. అయినప్పటికీ వాటిని ఏమీ పట్టించుకోకుండా తన లైఫ్ తాను చూసుకుంటుంది. ప్రస్తుతం సునీత చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నారు.
కాగా, సునీత ఓ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో తన రూమ్ లో కూర్చుంది. అక్కడికి ఓ యూట్యూబర్ వచ్చాడు. అతను సింగర్ సునీత నడుముపై చేయి వేసి హాగ్ ఇచ్చాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది చూసిన ప్రతి ఒక్కరూ నడుముపై చేయి వేయడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఆ యూట్యూబర్ ను దారుణంగా తిడుతున్నారు.