టాలీవుడ్, కోలీవుడ్ లో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న యోగి బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈమధ్య చాలా తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. తాజాగా యోగి బాబు ప్రయాణిస్తున్నటువంటి కారు యాక్సిడెంట్ కి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళనాడులోని రాణి పేటలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా రోడ్డు సైడ్ ఉన్నటువంటి భారీకేర్లను ఢీ కొట్టినట్లుగా పోలీసులు తెలియజేశారు. ఈ విషయం విన్న వెంటనే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


అయితే ఈ ఘటనలో యోగి బాబు కు ఎలాంటి గాయాలు కాలేదని ప్రమాదం నుంచి బయటపడ్డారని పోలీసులు సైతం  తెలియజేయడంతో అభిమానులు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు.. యోగి బాబు జైలర్, బిస్ట్, వరుణ్ డాక్టర్, వారసుడు, తదితర చిత్రాలలో కూడా కమెడియన్ గా నటించి బాగా పరిచయమయ్యారు. అయితే యోగ బాబు కారు ప్రమాదం సంఘటన పైన స్పందించాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. 2010లో బయ్యా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యోగి బాబు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాలను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్లారు. ఇలా తమిళంలోనే కాకుండా మలయాళం ,తెలుగు వంటి భాషలలో కూడా నటించారు.


యోగి బాబు మొదట్లో సిని ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే సమయంలో ఎన్నో అవమానాలను ఇబ్బందులు పడ్డారనే విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఒకసారి సక్సెస్ అయ్యాక ప్రతి సినిమాలో కూడా తననే ఉండేలా చూసుకుంటున్నారు. యోగి బాబు హీరోగా కూడా పలు చిత్రాలలో నటించడం జరిగింది. అలాగే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో యోగి బాబు రెమ్యూనరేషన్ కూడా భారీగానే పుచ్చుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి యోగి బాబు గురించి ఈ విషయమైతే వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: