
డాకు మహారాజ్ సినిమాలో హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా నటించారు. ఈ సినిమా రూ. 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకు తమను సంగీతాన్ని అందించారు. బాలయ్య బాబుకు తమన్ సంగీతం అందించడం సెంటిమెంట్ అయింది. వరుసగా బాలయ్య బాబుకు నాలుగు హిట్ సినిమాలకు తమన్ సంగీతం అందించడం విశేషం.
ఈ సంతోషంలో బాలయ్య బాబు వరుసగా నాలుగు హిట్ సినిమాలు అందించినందుకు గాను రీసెంట్ గా ఓ ఖరీదైన కారును తమన్ కు బహుమతిగా ఇచ్చాడు. నాకు తమన్ తమ్ముడు లాంటివారు అంటూ చెప్పుకొచ్చారు. కాగా, బాలయ్య బాబు అభిమానులకు ఓ శుభవార్త అందజేశారు. ఎప్పటినుంచో ఈ సినిమాను టీవీలలో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, డాకు మహారాజ్ సినిమా ఈ నెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ఎక్స్ లో వెల్లడించారు. "అనగనగా ఒక రాజు చెడ్డవాళ్ళు అందరూ డాకు అనేవాళ్లు... కానీ మాకు మాత్రం మహారాజు" అని రాసుకోచ్చారు. దీంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ-2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్లుగా సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ నటించబోతున్నారు.