![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-lakshmi-pranathie3e09eef-6dc4-4ac3-ae59-ca385a4bc53f-415x250.jpg)
అయితే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు పూర్తవుగానే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుకలకు వెళ్లే వాడిన రామ్ చరణ్ గతంలో స్వయంగా చెప్పుకొచ్చారు . వీరి మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. అయితే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి బాగా ఇష్టమైన సినిమా ఒకటి ఉందట .. ఆ సినిమా మరేదో కాదు మగధీర .. ఇక ఈమె చదువుకునే రోజుల్లో ఈ సినిమాని ఎంతో ఇష్టపడి చూసేదట . అలాగే తన స్నేహితుతో కలిసి ఈ సినిమాను ఆ రోజుల్లో రెండు మూడు సార్లు థియేటర్‌కు వెళ్లి చూసిందట .. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కూడా చెప్పుకోచ్చారు .. మగధీర సినిమాని అప్పట్లో థియేటర్లో చూడని వారు ఎవరు ఉండరు .. ఆ రోజులోనే ఈ సినిమాకు 140 కోట్లకు పైగా గ్రాస్ వచ్చి 70 కోట్లకు పైగా షేర్ కలెక్షన్ రాబట్టింది ..
ఇప్పటికీ ఈ సినిమా రామ్ చరణ్ కేరీర్ లోనే ఓ ఆల్ టైం కల్ట్ సినిమాగా మిగిలిపోయింది. రామ్ చరణ్ నటించిన సినిమాల్లో మగధీర సినిమా ఎన్టీఆర్ భార్యకు బాగా ఇష్టమైన సినిమాగా నిలిచిపోంది . అలాగే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా ఎన్టీఆర్ భార్యకు ఇష్టమట. ఈ సినిమాను కూడా ఈమె ఎంతో ఇష్టంగా చూస్తుందట. ఇక మరి ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే గేమ్ చేంజర్ సినిమాతో ఈ సంక్రాంతికి వచ్చి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలు వేసుకున్నాడు .. ప్రస్తుతం బుచ్చిబాబుతో తన 16వ సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమాతో ఎలా అయినా మరోసారి భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు .. మరి రామ్ చరణ్ కల బుచ్చిబాబు నెరవేరుస్తారో లేదో చూడాలి.