బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకు వాలెంటైన్స్ డే రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సినిమా చావా .. చత్రపతి శివాజీ తనయుడు చత్రపతి సంబాజి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించాడు .. అలాగే రష్మిక మందన్న‌ హీరోయిన్గా నటించింది .. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టక్‌ను తెచ్చుకుంది .. అలాగే బాలీవుడ్లో ఈ 2025లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో అన్నిటికన్నా చావా సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది .. మొదటి రోజు ఈ సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టింది . ఇలాంటి గొప్ప సినిమాని టాలీవుడ్ లో మిస్ చేసుకున్న స్టార్ హీరో అతనేనా ? ఆ హీరో చేసుంటే ₹2,000 కోట్లు కలెక్షన్లు వచ్చేవా.. బాలీవుడ్ ప్రేక్షకులు గర్వంగా పిలవబడే ప్రతిష్టాత్మక సినిమాల్లో చావ కూడా ఒకటి ..


ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే మొదటి రోజు నుంచి రికార్డ్ బ్రేకింగ్ వ‌సూళ్లు నమోదు అవుతున్నాయి .. చత్రపతి శివాజీ మహారాజ్ ఏలిన నేల కావటంతో అక్కడి ప్రజలు ఆయన్ని ఆయన కుటుంబాన్ని దేవుడులా కొలుస్తారు .అందుకే ఆయన స్టోరీని ఆధారంగా చేసుకుని తీస్తున్న సినిమాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు .. ఈ సినిమా మూడు రోజుల్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టేసింది. అయితే ఇప్పుడు ఇదంతా పక్క‌న‌ పెడితే ఈ సినిమాని ముందుగా మన టాలీవుడ్ స్టార్ హీరోతో చేయాలని అనుకున్నారు .. అది కూడా ఈ మధ్య కాదు 8 ఏళ్ల  క్రితం ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు .. మహేష్ తో ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో లాంచ్‌ చేయాలని భావించారు .. కానీ మహేష్ బాబు బాలీవుడ్ వైపు అడుగులు వేయడానికి అసలు ఇష్టపడలేదు .. దాంతో ఈ సినిమాని చేతులారా వదులుకున్నారు.


అయితే ఒకవేళ మహేష్ గతంలో ఈ సినిమాను ఒప్పుకుని చేసుంటే ప్రభాస్ కంటే ముందుగానే పాన్ ఇండియా స్టార్‌ అయ్యేవాడు .. ఇక మహేష్ నో చెప్పేసరికి కొంతకాలం లాకర్లో పెట్టిన ఈ కథని మళ్లీ బయటికి తీశారు. దర్శకుడు లక్ష్మణ్ ఈ స్టోరీకి కొన్ని మెరుగులు దిద్ది విక్కీ కౌశల్ తో తెర్కకించాడు ఇక హీరోయిన్గా ముందుగా విక్కీ భార్య కత్రినా కైఫ్ ని తీసుకుందామని అనుకున్నారు .. కానీ ఎందుకు ఆమె నో చెప్పింది .. ఇక దాంతో య‌నిమల్ , పుష్ప సినిమాల‌తో బాలీవుడ్ ను షేక్ చేసిన రష్మిక ని ఈ సినిమా కోసం తీసుకున్నారు . అలాగే ఆమె పాత్రకు కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది .. ఇలా మొత్తంగా ఈ సినిమాని హిందీ హీరో కంటే తెలుగు హీరోతో చేసుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చేవి .. మరో వెయ్యికోట్ల సినిమా గా రికార్డు క్రియేట్ చేసేదంటూ  సిని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: