
ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ స్థాయిలో సక్సెస్ సాధిస్తే మహేష్ ను మించిన హీరో మరొకరు ఉండరు అనే రేంజ్ లో ఆయన క్రేజ్ పెరుగుతుంది .. అలాగే ఇండియన్ సినిమా నుంచి మొదటిసారిగా హాలీవుడ్ గడ్డమీద జెండా ఎగరేసిన హీరోగా కూడా మహేష్ రికార్డు క్రియేట్ చేస్తాడు. మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా కోసం మహేష్ - రాజమౌళి ఎంతో అచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారు . ఇక మరి ఈ సినిమాతో ఇద్దరు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారని చూడాలి . అయితే గతంలో మహేష్ బాబుతో ఓ స్టార్ దర్శకుడు సినిమా చేస్తానని చెప్పి స్టోరీ కూడా చెప్పాడట .. ఆ తర్వాత సినిమా చేయకుండా మధ్యలోనే ఆపేసాడు ..
ఇక దానికి ఆ దర్శకుడు మహేష్ బాబు కి సారీ కూడా చెప్పాడని గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి .. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ? ఆ సినిమా ఏంటి ? అనుకుంటున్నారా ఇంతకు ఆ దర్శకుడు మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ .. గతంలో మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది . అంతా రెడీ అయిన తర్వాత కథ కూడా మహేష్ బాబుకి వినిపించి అంతా ఓకే చేసుకున్నారు .. మళ్ళీ తనలో తానే ఆలోచించుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ కథ మహేష్ బాబుకు సెట్ అవ్వద్దని భావించి మహేష్ తో ఆ సినిమా వర్కౌట్ కాదని చెప్పి వేరే హీరోతో ఆ సినిమా చేశారు .. ఇక అప్పటినుంచి మహేష్ బాబు కూడా వర్మ డైరెక్షన్లో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.