టాలీవుడ్‌ స్టార్‌ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఐశ్వర్య రాజేష్ తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఈ చిన్నదానికి పెద్దగా గుర్తింపు రాలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని తనకు వేసుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు భార్య పాత్రలో చాలా అమాయకంగా నటించి మంచి గుర్తింపు అందుకుంది.

సినిమా అనంతరం నటి ఐశ్వర్య రాజేష్ కు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఐశ్వర్య బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.... నటి ఐశ్వర్య రాజేష్ చేసిన కొన్ని కామెంట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా ఆమె ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఐశ్వర్య మాట్లాడుతూ.... ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

దశాబ్ద కాలంలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు నేను పెద్ద అభిమానిని అని ఐశ్వర్య రాజేష్ అన్నారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కానీ అతనితో కలిసి నటించే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఎన్టీఆర్ తో కలిసి నటిస్తానంటూ ఐశ్వర్య రాజేష్ అన్నారు.


డ్యాన్స్, డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ అందరి కన్నా చాలా స్పెషల్. అందరి నటన నాకు చాలా ఇష్టం. కానీ ఎన్టీఆర్ చాలా ఇష్టం అని చెప్పారు. నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని ఐశ్వర్య రాజేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఇక హీరోయిన్లలో అలియా భట్ నటన చాలా బాగుంటుందని, తన నటన నాకు ఎంతగానో ఇష్టమంటూ ఐశ్వర్య రాజేష్ అన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: