మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు .. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘HIT: ది ఫస్ట్ కేస్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా దమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’  లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు విశ్వక్ .. అలాగే గత సంవత్సరం రిలీజ్ అయిన మెకానిక్ రాకీ మూవీ ఈ యంగ్ హీరో కెరియర్ లో మొదటి ప్లాప్ సినిమా .. తర్వాత మూడు నెలల తర్వాత లైలా సినిమాతో థియేటర్లోకి వచ్చాడు ఈ ఈ యంగ్ హీరో.. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది .. అయితే ఇంతకీ ఈ ఆకాంక్ష శర్మ ఎవరని అనుకుంటున్నారా ? ఈ బ్యూటీ మహేష్ బాబు తో ఓ కమర్షియల్ యాడ్ లో కూడా నటించింది .. ఆ విషయాలు ఏమిటి అనేది ఇక్కడ చూద్దాం.


లైలా మూవీ నుంచి ఇచ్చుకుందాం బేబీ అంటూ రిలీజ్ అయిన పాటలో టూ పీస్ బికినీలో మంటలు పుట్టించింది హీరోయిన్ ఆకాంక్ష శర్మ .. టాలీవుడ్‌కు ఈమె కొత్త అయినప్పటికీ బాలీవుడ్ లో ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు ఉంది. సింగర్ బాద్షాతో కలిసి పలు ఆల్బమ్స్ చేసిన ఆకాంక్ష .. హీరో టైగర్ ష్రాఫ్‌తో ‘డిస్కో డ్యాన్సర్ 2’  మూవీలో డాన్స్ కూడా చేసింది .. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సంతూర్ యాడ్‌లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ .. ఇక ఆ యాడ్ లో కనిపించే సంతూర్ మమ్మీ నే ఈ ఆకాంక్ష శర్మ .. సంతూరు యాడ్ తర్వాత ఆకాంక్షకు వరుస ఆఫర్లు వచ్చాయి . అందులో ఒకటే విశ్వక్ సేన్ లైలా మూవీ.


అలాగే ఈ ముద్దుగుమ్మ కి ఇన్‌స్టాగ్రామ్‌లో వన్ మిలియన్ కి పైగా ఫాలోవులు ఉన్నారు .. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు, లేటెస్ట్ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ .. అవసరమైతే గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ హింట్‌ కూడా ఇచ్చేసింది బ్యూటీ .. లైలా మూవీలో ఏకంగా బికినీలో తన అందాలు ఆరబోసి మరీ రెచ్చిపోయింది .. రాబోయే రోజుల్లో ఈ సంతూర్ మమ్మీకి టాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: