యంగ్ హీరో విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన విశ్వక్సేన్ తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విశ్వక్సేన్ కి యూత్ లో విపరీతంగా అభిమానులు ఉన్నారు. కాగా, ఈ హీరో నుంచి వచ్చిన తాజా చిత్రం లైలా. ఈ సినిమాకు రామ్ నారాయణ దర్శకత్వం వహించారు. లైలా సినిమాలో విశ్వక్సేన్ మొదటిసారిగా లేడీ గెటప్ లో కనిపించారు. తన కెరీర్ లో మొదటిసారిగా లేడీ పాత్రలో నటించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు.


సినిమా ఫిబ్రవరి 14వ తేదీన విడుదలై నెగిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఆసక్తికరమైన ఓ పాయింట్ బయటకు రావడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే మంచి బజ్ ప్రేక్షకులలో ఏర్పడింది. ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ తో లైలా సినిమా మరింత హైప్ క్రియేట్ చేసుకుంది. అంతే కాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ తో వైసీపీ క్యాడర్ ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు చేశారు. కాగా, ఈ సినిమా లవర్స్ డే రోజున రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.


సినిమా విడుదలైన మొదటిరోజు 1.5 కోట్ల కలెక్షన్లను మాత్రమే సంపాదించింది. ఇక విశ్వక్సేన్ ఇదివరకు చేసిన చాలా సినిమాలు మొదటి రోజు భారీగా కలెక్షన్లు సంపాదించాయి. లైలా సినిమా మాత్రమే చాలా తక్కువ కలెక్షన్లను వసూలు చేయడం నిజంగా బాధాకరం. విశ్వక్సేన్ చేసిన లాస్ట్ ఐదు సినిమాల మొదటి రోజు కలెక్షన్లను పరిశీలించినట్లయితే దాస్ కా దమ్కీ సినిమా విడుదలైన మొదటి రోజు 8.8 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.


గామి సినిమా 8.3 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదటి రోజు 8 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మెకానిక్ రాఖీ సినిమా 1.6 కోట్ల కలెక్షన్లను రాబట్టగా లైలా సినిమా మాత్రం 1.5 కోట్ల కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది. విశ్వక్సేన్ నటించిన సినిమాలన్నింటిలో మొదటి రోజు కలెక్షన్లలో లైలా సినిమా మాత్రమే చాలా తక్కువగా కలెక్షన్లను రాబట్టి డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఇలా విశ్వక్‌ కెరీర్‌ కూడా డిజాస్టర్‌ అవుతోందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: