
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులలో ప్రత్యేకమైన స్టూడియోలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఈ చిత్రంలో ఒక పాత్రలో హీరోయిన్ ఆలియా భట్ కూడా కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఆలియా భట్ ఒక యువరాణి పాత్ర చేయబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అందుకే ఆలియా భట్ నీ సంప్రదించారని ఆలియా భట్ కూడా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
మరి ఫౌజీలో ఆలియా భట్ అతిధిగా నటిస్తున్నారా ?లేదా అనే విషయం ఇంకా చిత్ర బృందం అధికారికంగా తెలియజేయాల్సి ఉన్నది. ఫౌజీలో అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి తదితర నటీనటులు సైతం కేజీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తూ ఉన్నారట. మరి ఒకవేళ ఆలియా భట్ కనుక ఫౌజి చిత్రంలో నటిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు కూడా వెలువడమే కాకుండా పాన్ ఇండియా లేవల్లో మరొకసారి క్రేజ్ పెరుగుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. మరి ఆలియా భట్ పైన వస్తున్న ఈ వార్తలు ఎంత నిజమో చూడాలి మరి.