పుష్పా సినిమాలతో తనకంటూ పాన్ ఇండియా స్థాయిలో సపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. రీసెంట్ గా వచ్చిన పుష్పా 2 సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో 1900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండియన్ చరిత్రలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసి భారీ విజ‌యాన్నీ అల్లు అర్జున్ కు అందించింది .. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎంతో కేర్ఫుల్గా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు .. పుష్ప సినిమాల తర్వాత అల్లు అర్జున్ తన తర్వాత సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌తో చేయబోతున్నాడు .. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో తీసుకురాబోతున్నారని విషయం తెలిసిందే ..


అయితే ఈ సినిమాకు కూడా అల్లు అర్జున్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు .. ఇక పుష్ప సినిమాల‌ కోసం ఏకంగా 300 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఏమాత్రం తగ్గకుండా 350 నుంచి 400 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి .. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 700 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది .. ఇక మరి త్రివిక్రమ్ ఈ సినిమాని ఎలా తెర్కకిస్తారు .. అల్లు అర్జున్ కు మరో బ్లాక్ బస్టర్ విజయం ఇస్తాడా లేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.


అలాగే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తనను మించిన మరో దర్శకులేడు అనే రేంజ్ లో ఈ సినిమాని చేయబోతున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి .. నిజంగా త్రివిక్రమ్ ఆ స్థాయిలో సినిమాను చేయగలడా .. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన త్రివిక్రమ్ మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఎంతో కష్టపడుతున్నాడు .. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు .. కాబట్టి ఈ సినిమాకి భారీ రేంజ్ లో బడ్జెట్ పెట్టబోతున్నాడు.. ఇక మరి అల్లు అర్జున్ త్రివిక్రమ్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: