గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు .. ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా సరే బ్లాక్ బస్టర్ అవుతుంది .. ఆయన నటిచ్చిందల్లా బంగారం అవుతుంది . సంక్రాంతికి డాకు మహారాజ్‌తో మరో బ్లాక్ బస్టర్ ను త‌న ఖాత‌లో వేసుకున్నాడు బాలయ్య .. ప్రజెంట్ బోయపాటితో అఖండ 2 సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 50% షూటింగ్ పూర్తయింది .. మిగిలిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసి దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బాలకృష్ణ మరో సినిమాపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు .. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక సినిమాకు ఆయన ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి ..


జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది .. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది .. బాలయ్య లేకుండానే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాలని గోపీచంద్ మలినేని  ప్లాన్ చేస్తున్నారు .. ఇప్పటికే హీరోయిన్ ని కూడా ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి .. గతంలో కంటే ఈ సినిమాలో బాలయ్య కొంత డిఫరెంట్ గా కనిపిస్తారట. బాలయ్యకు వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయం ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు మరో హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు .. కథ ఆల్మోస్ట్ బాలయ్యకు తగ్గట్టు మార్చేశాడు .. బాలయ్య చిన్న కూతురు తేజస్విని స్టోరీని ఫాలోఅప్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి .. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బాలకృష్ణ త్వరలోనే మరో దర్శకుడు హరీష్ శంకర్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి .. ఇప్పటికే ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందా అని తెలుస్తుంది .. హరి శంకర్ చెప్పిన స్టోరీ లైన్ బాలకృష్ణ తో పాటు ఆయన చిన్న కూతురు తేజస్వినికి కూడా బాగా నచ్చిందట.


అయితే ఇప్పుడు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ఓ అగ్ర నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి . పాన్ ఇండియా మూవీ టాక్సిక్ సినిమాను నిర్మిస్తున్న కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ .. బాలకృష్ణ - హరీష్ శంకర్ కాంబోలో వచ్చే సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తుంది .. అన్ని అనుకున్నట్టు కుదిరితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావచ్చునే వార్తలు వస్తున్నాయి .. ఒకవైపు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేయాలి .. పవన్ కళ్యాణ్ వేరే సినిమాలు తోనూ  అధికారిక కార్యక్రమాలతోనే బిజీగా ఉండటంతో ఆ సినిమా లేట్ అవుతూ వస్తుంది .. అయితే ఇప్పుడు ఈ సమయంలో లేట్ చేయకుండా బాలకృష్ణతో ఓ సినిమా కంప్లీట్ చేయాలని హరీష్ గట్టి టార్గెట్ గా పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: