
అయితే ఇప్పుడు మరో సినిమాకి కూడా రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. సుకుమార్ తో తన 17వ సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు .. బుచ్చిబాబు సినిమా షూటింగ్ ఇప్పటికే ఎంతో స్పీడ్ గా జరుగుతుంది .. ఇప్పటికే రామ్ చరణ్ పోషణ్ కంప్లీట్ అయిన తర్వాత సుకుమార్ సినిమాను మొదలుపెట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బుచ్చిబాబు సినిమాని త్వరగా రిలీజ్ చేసి సుకుమార్ ను మాత్రం కాస్త లేట్ చేయాలని రామ్ చరణ్ చూస్తున్నట్టు టాక్ .. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ చేసిన పాన్ ఇండియా సినిమాలు అతనికి ఏవి సక్సెస్ ఇవ్వలేదు .. దీంతో చరణ్ కాస్త ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలి.. ఇక చరణ్ కోసం క్యూలో చాలామంది దర్శకులు ఉన్నారు .. ఇక రామ్ చరణ్ 5 సంవత్సరాల తర్వాత డేట్ ఇచ్చిన పర్లేదు మేము వెయిట్ చేస్తామని కొంతమంది చెబుతున్నారు .. ఇక ఇందులో ముగ్గురు దర్శకులు కాస్త ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ స్టార్ మేకర్ నిఖిల్ నగేష్ , చరణ్ ఇమేజ్ కి తగ్గ ఓ డిఫరెంట్ స్టోరీని రెడీ చేసి పెట్టుకున్నారు .. అలాగే పౌరాణిక నేపథ్యంలో సాగే స్టోరీ అని తెలుస్తుంది .. ఇది రామ్ చరణ్ కు చెప్పారా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు .. కచ్చితంగా ఆయన వింటే మాత్రం అది ఓకే చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది .. అలాగే హాయ్ నాన్న సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారినా శౌర్యువ్ తో మరో సినిమా చేసే అవకాశం కనబడుతుంది .. ఈ దర్శకుడు కూడా రామ్ చరణ్ కోసం ఒక కథ రెడీ చేసి పెట్టుకున్నాడు .. చరణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఆ స్టోరీ రెడీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి .. అలాగే మరో కోలీవుడ్ దర్శకుడు కూడా రామ్ చరణ్ కోసం ఎదురుచూస్తున్నారు .. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కూడా రామ్ చరణ్ ఓ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది .. వీరిద్దరి మధ్య ఓ స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఓకే అయిందని కూడా టాక్ ఉంది.