సందీప్ రెడ్డి వంగ ..ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు . పాన్  ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్లు ఉన్నారు.  ఏకంగా ఇండియన్ ఫిలిం హిస్టరీకి ఫస్ట్ టైం ఆస్కార్ తీసుకొచ్చిన ఘనత కూడా అందుకున్న డైరెక్టర్ రాజమౌళి కూడా ఉన్నారు . కానీ సందీప్ రెడ్డివంగా పేరు చెప్తే మాత్రం ఏ డైరెక్టర్ పేరు చెప్పినా వినపడిని అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దానికి కారణం ఆయన తెరకెక్కించే సినిమాలు . నిజాన్ని నిక్కాస్ అయిన నిజంగా తెరకెక్కించే విధంగానే ఈయన సినిమాలో ఉంటాయి. ఎదుటి వాళ్ళు ఏమనుకున్న ఐ డోంట్ కేర్.. నేను అనుకున్న కథను నేను రాసుకున్న సీను యధావిధిగా తెరకెక్కిస్తా అందుకు తగ్గిన నటీనటులు కావాలి అలాంటి వాళ్ళనే చూస్ చేసుకుంటా అనే టైప్ సందీప్ రెడ్డివంగాది.


గతంలో ఆయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి ..సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమా చూస్తే ఆ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించాడో దానికి అమ్మ మొగుడు రేంజ్ లోనే "యానిమల్" సినిమాను  తెరకెక్కించాడు సందీప్ రెడ్డివంగా . కాగా ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ "స్పిరిట్" అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు . ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలానే కష్టపడుతున్నాడు సందీప్ రెడ్డివంగా .



అయితే సందీప్ రెడ్డివంగా సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత హైలెట్ అవుతుందో విలన్ క్యారెక్టర్ కూడా అంతే హైలెట్ అవుతుంది. ఇప్పటివరకు మనం ఆయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఆ విషయం ఈజీగా క్లియర్గా అర్థం అయిపోతుంది. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సందీప్ రెడ్డి వంగ తన సినిమాలో విలన్ గా ప్రభాస్ కోసం రానా దగ్గుబాటిని చూస్ చేసుకున్నారట . ఆల్రెడీ బాహుబలి సినిమాలో వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ చూసాడు . ఇప్పుడు దానికి క్వవైట్ ఆపోజిట్ గా ఉండే రోల్స్ ని ఇక్కడ చూపించబోతున్నారట.  రానా దగ్గుబాటి కెరియర్ కి ఇది ఒక కీలక మలుపుగా మారిపోతుంది అంటున్నారు జనాలు . అంతేకాదు సందీప్ రెడ్డివంగా ప్రభాస్ ని ఏ విధంగా చూపించబోతున్నాడో సేమ్ అందుకు ఈక్వల్ గానే రానా దగ్గుబాటి క్యారెక్టర్ ని కూడా రాసుకున్నారట.  సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: