![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-ram-charan75759125-a14c-4cca-9785-4dce797141bf-415x250.jpg)
రీసెంట్ గానే గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో అందరూ నిరాశ చెందారు .. కానీ బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోయే సినిమాతో మాత్రం భారీ విజయాన్ని అందుకుంటామని దృఢ సంకల్పంతో మెగా అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఆస్తులు విలువ ఎంత అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ గా మారుతున్నాయి .. నిజానికి రామ్ చరణ్ ఒక్కో సినిమాకి దాదాపు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నాడు ..
ఆయనకు స్వతహాగా ఇతర బిజినెస్ లు కూడా ఉన్నాయి .. కాబట్టి ప్రస్తుతం ఆయన ఆస్తులు విలువ దాదాపు 5వేల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనాలు ఉన్నాయి. అలాగే ఆయన దగ్గర కాస్ట్లీ కారులు కూడా నాలుగు ఐదు రకాలు ఉన్నాయి. . ఖరీదైన భారీ ప్యాలెస్లు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి .. ఈ మొత్తం కలిపి 5000 కోట్ల వరకు ఆస్తి విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు .. ఇక మరి ఏదేమైనా కూడా ఇంత ఆస్తి సంపాదించినా కూడా ఒక గొప్ప స్టార్ హీరో కొడుకు అయి ఉండి కూడా రామ్ చరణ్ ఎంతో సింపుల్ గా లైఫ్ను కొనసాగిస్తున్నాడు.