![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/star-herobe52b4c9-56bc-436b-8d86-db3c4ff5848d-415x250.jpg)
ఒకప్పుడు హీరోగా ఆ తర్వాత విలన్ పాత్రలు చేస్తూ ఇండియన్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ క్రియెట్ చేసుకున్నాడు .. రీసెంట్ గానే ఆయన ఇంట్లో ఒక దొంగ చొరబడి ఆయన మీద దాడి చేసిన విషయం కూడా తెలిసింది. ఆ ఇన్సిడెంట్ లో ఏ ప్రమాదం జరగకుండా సైఫ్ బయటపడ్డాడు .. అయితే ఇప్పుడు 50 వేల కోట్లుకు అధిపతి అయినప్పటికీ ఆయన చాలా సింపుల్గా ఉంటాడని చాలా మంది చెబుతూ ఉంటారు .. పాటౌడి ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు .. ప్రజెంట్ టాలీవుడ్ , హిందీ సినిమాల్లో విలన్ పాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సైఫ్ అలీ ఖాన్. రీసెంట్ గానే దేవర సినిమాలో ఆయన చూపించిన వీలనిజం ఎంతో అద్భుతంగా ఉంది ..
ఇక ఇప్పుడు ఆయనకు మరికొన్ని టాలీవుడ్ సినిమాల్లో మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి . ఇలాంటి సమయంలో ఊహించిన విధంగా ఆయన మీద దాడి జరగడంతో కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉందని డాక్టర్లు చెప్పడంతో ప్రస్తుతం సైఫ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు . అలాగే మన ఇండియన్ చిత్ర పరిశ్రమలో చాలామంది నటులు ఉన్నప్పటికీ కూడా ఇలా సింప్లిసిటీ కోరుకొని హీరోలు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారని సినీ ప్రముఖులు సైతం అంటున్నారు .. 50వేల కోట్ల ఆస్తికి అధిపతి అయిన కూడా ఎందులోను అహంకారమైతే చూపించడు అందువల్లే ఆయనకు చాలా ఎక్కువ మంది అభిమానులు కూడా ఉన్నారు.