
పాత్ర ఏదైనా సరే ఇట్టే అందులో పరకాయ ప్రవేశం చేయటం మహేష్ మంజ్రేకర్ స్టైల్ .. అందుకే ఆయనకి ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది .. అందుకే మాజీ సీఎం జగన్ జీవిత ఆధారంగా వచ్చిన యాత్ర 2లో కూడా అద్భుతంగా నటించి మెప్పించారు. తెలుగు , తమిళం , కన్నడ , హిందీ , మరాఠీ ఇలా అన్ని భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు మహేష్ మంజ్రేకర్ .. అలాగే దర్శకుడుగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు .. ఈ సీనియర్ నటుడు ఫ్యామిలీ గురించి జనాలకు పెద్దగా తెలియదు .. ఈ సీనియర్ నటుడు కి ముగ్గురు పిల్లలు ఇందులో ఒక కూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ .
ఇంతకి ఆమె మరెవరో కాదు సయీ మంజ్రేకర్ .. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాతో హీరోయిన్గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది .. అందం అభినయంతో ఆకట్టుకుంది .. కానీ అంతగా అవకాశాలు అయితే రావట్లేదు .. టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు నటిస్తుంది ఈ బ్యూటీ .. వరుణ్ తేజ్ కు జంటగా గాని , రామ్ పోతినేని తో స్కంద , మేజర్ సినిమాలో నటించి మెప్పించింది .. అయితే టాలీవుడ్ లో కూడా ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు .. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా హాట్ హాట్ ఫోటోలతో రచ్చ లేపుతూ ఉంటుంది ఈ బ్యూటీ.