విజయ్ దేవరకొండ .. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ అఫ్ ది స్టైలిష్ హీరో . అల్లు అర్జున్ తర్వాత అలాంటి స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ఏ హీరోకి ఇస్తే బాగుంటుంది అని అడిగితే కచ్చితంగా జనాలు చెప్పే మొట్టమొదటి పేరే విజయ్ దేవరకొండ . కొంతమంది ఆటిట్యూడ్ హీరో అని కొంతమంది స్టైలిష్ హీరో అని మరి కొంతమంది రౌడీ హీరో అని .. ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . విజయ్ దేవరకొండ సినిమాలు ఎంతలా జనాలను ఆకట్టుకుంటూ ఉంటాయో అందరికీ తెలిసిందే .


విజయ్ దేవరకొండ నటించే సినిమాలు ఫ్లాప్ అయినా సరే జనాలని మాత్రం బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి . మరి ముఖ్యంగా పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి సినిమాలు ఆయన కెరియర్ లోనే ది మోస్ట్ స్పెషల్ . అయితే ఆ తర్వాత అంతటి స్పెషల్ మూవీ ఏదైనా ఉంది అంటే మాత్రం కచ్చితంగా వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పాలి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ వేరే లెవెల్ . అన్ని విధాల ఆకట్టుకుంటాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రాశి ఖన్నాతో  కొన్ని సీన్స్ అప్పట్లో హైలైట్ గా మారాయి .



మరీ ముఖ్యంగా రాశిఖన్నా కారు లో నుంచి విజయ్ దేవరకొండ ని "అన్నా" అని పిలవడం అప్పట్లో జనాలు బాగా ట్రోల్ చేశారు . విజయ్ దేవరకొండ లాంటి హీరోని అన్నా అని ఎలా పిలవగలిగావు అంటూ రాశిఖన్నాను సరదాగా ఆటపట్టించారు . వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.  జనాలకి చమటలు కూడా పట్టించేసింది.  అంత హాట్ గా నటించారు రాశిఖన్నా విజయ్ దేవరకొండ . మరొకసారి ఇదే రీల్ ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . సోషల్ మీడియాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోయిన్ రాశిఖన్నాకి సంబంధించిన వార్తలుగా  వైరల్ గా మారాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: