
ఇక మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి . సిటీలో ఎవ్వరికి ఇతను సరఫరా చేస్తున్నాడని కోణంలో కూడా పోలీసులు ప్రశ్నించారు .. బెంగళూరు , గోవా నుంచి డ్రగ్స్ వస్తున్నట్టు మస్తాన్ సాయి అంగీకరించాడు .. అలాగే తాను ఎవరికి డ్రగ్స్ సరఫరా చేయలేదని కేవలం తన పార్టీల కోసం అవి వాడుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక లావణ్య తనకు ఎక్కడ ఎలా పరిచయమైనా విషయాన్ని కూడా పోలీసులకు ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశాడు మస్తాన్ సాయి . అలాగే ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్లు పలుమార్లు అత్యాచారం చేసినట్లు కూడా అంగీకరించాడు .. అయితే తాను లావణ్య పై అత్యాచారం చేయలేదని ఆమె అంగీకారంతోనే ఇద్దరం అలా చేసుకుట్లు పోలీసులకు చెప్పాడట..
ఇక మరోపక్క మస్తాన్ సాయి ఇష్యూలో అతని తండ్రి ధర్మకర్త పోస్ట్ ఉడిపోయేలా ఉంది .. గుంటూరులో మస్తాన్ దర్గా ధర్మకర్తగా కొనసాగే అర్హత మస్తాన్ సాయి తండ్రికి లేదంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు పలువురు లేఖ రాశారు.. నాగూర్ బాబు అనే అడ్వకేట్ గవర్నర్ కు ఈ లేఖ రాశారు .. మస్తాన్ సాయి తండ్రి రావి మోహన్ రావు కుటుంబంకు వారసత్వంగా తరతరాలుగా మస్తాన్ దర్గాకు ధర్మకర్తలుగా ఉంటున్నారు . ఇప్పుడు మస్తాన్ సాయి చేసిన పనితో దర్గా ప్రతిష్ట మస్కబారిందని దర్గాకు వచ్చే భక్తుల భద్రతకు కూడా ముప్పు ఉందని లేఖలో పేర్కొన్నారు లాయర్ .. ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో దర్గాను నడపాలని కోరారు .