![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-natarathna-ntr01c9e3b4-4964-45e8-a58e-1c27042040be-415x250.jpg)
ఇక అప్పుడు మద్రాస్ వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు .. అప్పటికే మన దేశం షూటింగ్ మొదలైంది .. ఇక ఈ సినిమాను మీర్జాపురం రాజా వారి సతీమణి నటి కృష్ణవేణి నిర్మించి హీరోయిన్గా నటించారు. ఇక మనదేశంలో ఎన్టీఆర్ నెగిటివ్ స్టేట్స్ ఉన్న పోలీస్ పాత్రలో నటించి అదరగొట్టారు. అందుకుగాను ఆయనకు 250 రూపాయల పారితోషకం ఇచ్చారు. నటి కృష్ణవేణి ఏ ముహూర్తాన ఎన్టీఆర్ కి అంత ఇచ్చారో కానీ తర్వాత రోజుల్లో ఎవరు అందుకోలేని అగ్ర నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అందుకే కృష్ణవేణి ఇది లక్కీ హ్యాండ్ అని అప్పటి సినీ జనం అంటూ ఉంటారు .
అలాగే మన దేశం సినిమాకి గంటసాల సంగీతం అందించారు .. రేలంగి ఇందులో పోలీస్ వెంకటస్వామి పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమా పాటలు కూడా ఎంతో బాగా హీట్ అయ్యాయి .. ఎందరో కొత్త నటులతో తెరకెక్కిన మన దేశం మూవీ 1949 నవంబర్ 24న రిలీజ్ అయింది .. అలాగే ఈ సినిమాకి ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన విప్రదాస్ ఆధారం .. ఆ కథకు యల్వీ ప్రసాద్ స్క్రీన్ ప్లే రాయిగా .. సీనియర్ రచయిత సముద్రాల మాటలు పాటలు అందించారు. అలాంటి ఎన్టీఆర్ మొదటి సినిమా తర్వాత చిత్ర పరిశ్రమలో ఎవరు అందుకొని స్థానంలోకి వెళ్లి తర్వాత రాజకీయ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు అంత గొప్ప వ్యక్తికి తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి పేరు తెలుగు సినిమా రంగంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.