నందమూరి బాలకృష్ణ కి జూనియర్ ఎన్టీఆర్ అంటే పడదని చాలా రోజుల నుండి వినిపిస్తున్న మాట.అయితే చిన్నతనంలో ఎన్టీఆర్ ను చాలా అవమానించారట. ఎన్టీఆర్ ని ఆయన తల్లిని ఇద్దరిని నందమూరి ఫ్యామిలీలో జరిగే ఎన్నో ఫంక్షన్లకు పిలిచి మరీ అవమానించారట. ఈ అవమానాలన్నీ దిగమింగుకొని ఎన్టీఆర్ ఎప్పటికైనా సరే వాళ్లే మళ్ళీ నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటాను అని తన స్టార్డంతో  మళ్లీ నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యారు.వాడు మా వాడే అని చెప్పుకునేలా చేశాడు. అయితే ఎన్టీఆర్ ని అవమానించిన విషయం గురించి సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ మాట్లాడుతూ.. బాలకృష్ణ తన కూతురు ఎంగేజ్మెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ని తన తల్లి శాలిని ని పిలిచి ఇంట్లోకి రాకుండా గేటు దగ్గరే ఆపేసారంటే ఆయనను ఎంత అవమానించారో మీరు అర్థం చేసుకోవచ్చు.

 ఎన్టీఆర్ ని అంత అవాయిడ్ చేసిన వాళ్లే మళ్లీ దగ్గరికి తీసుకొని మా నందమూరి హీరోనే అని చెప్పుకున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ కి స్టార్డం మామూలుగా రాలేదు.చిన్న వయసులోనే ఆయనకు జరిగిన అవమానాన్ని మనసులో పెట్టుకొని ఎప్పటికైనా సరే మంచి పొజిషన్లో ఉండాలి అని సినిమాలు చేసుకుంటూ పెద్దపెద్ద హీరోలతో పోటీపడి చివరికి గ్లోబల్ హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ తనకు తానే ఒక యుద్ధం చేశాడని చెప్పుకోవచ్చు.

 ఆ యుద్ధంలో ఎన్టీఆర్ గెలిచాడు అంటూ సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ప్రస్తుతం ఈయన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ని అంత ఘోరంగా అవమానించారా అని బాధపడుతున్నారు.అయితే మొదట్లో ఎన్టీఆర్ ని చేరదీసి బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ బాలకృష్ణ ఎన్టీఆర్ ల మధ్య ఎక్కడ గొడవ వచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతం మళ్ళీ బద్ద శత్రువులుగానే మారిపోయారు.ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలుద్దాం అన్నట్లే ఉన్నా కానీ బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ తో మాట్లాడానికి ఇష్టపడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: