
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో బెస్ట్ పెర్ఫార్మషన్స్ ఎవరనే ప్రశ్నా ఎదురవగా తన దృష్టిలో అయితే జూనియర్ ఎన్టీఆర్ అన్నది తెలియజేసింది. ఈ విషయం విన్న వెంటనే ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నప్పటికీ ఎందుకు అలా ఎన్టీఆర్ బెస్ట్ అని యాంకర్ అడగగా.. ఎన్టీఆర్ డైలాగ్స్ లలో చాలా స్పెషల్ ఉంటుంది అంటూ తెలియజేసిందట ఐశ్వర్య రాజేష్.. అందరికీ హీరోల ప్రదర్శన ఇష్టమే కానీ ఎన్టీఆర్ మాత్రం తన ఫేవరెట్ అంటూ వెల్లడించింది ఈ అమ్మడు.
ఇప్పటికే ఎన్టీఆర్ డాన్స్ గురించి నటన గురించి చాలామంది సెలబ్రిటీలు కూడా పొగడడం జరిగింది. ఐశ్వర్య కెరియర్ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.ఎక్కువగా ఫ్యామిలీ పాత్రలలో నటిస్తూ ఉండే ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి ప్లాట్ఫారం అయినప్పటికీ మరి ఏ మేరకు తన తదుపరి అవకాశాలను సంపాదించుకుంటుందో చూడాలి మరి. మరి రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ సినిమాలు ఏదైనా అవకాశం వచ్చిన నటిస్తుందేమో చూడాలి ఐశ్వర్య రాజేష్. మొత్తానికి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నాయి.