టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల లో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అంద రికీ తెలిసిందే. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌద రి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడిసినిమా కు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి అద్భుతమైన టాక్ రావడంతో ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ మంచి హోల్డ్ ను కనబరుస్తూ అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంకీ ఆ తర్వాత తక్కువ రోజుల్లోనే తన నెక్స్ట్ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు.

కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న వెంకటేష్ తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. దానితో వెంకీ అభిమానులు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ కు అద్భుతమైన విజయం దక్కింది. మరోసారి ఆ స్థాయి విజయాన్ని అందుకోవడం కోసం ఆయన అద్భుతమైన కథలను వెతుకుతున్నాడు. అందుకే నెక్స్ట్ మూవీ కి సంబంధించిన డిసిషన్ ను అంతా త్వరగా తీసుకోవడం లేదు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: