టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలుగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున ముందు వరుసలో ఉంటారు. వీరు ఎన్నో సంవత్సరాలుగా అద్భుతమైన విజయాలను అందుకుంటు ఇప్పటికి కూడా అద్భుతమైన పాన్ ఫాలోయింగ్ కలిగిన నటులుగా తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ నలుగురు హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వెళ్తుంటే నాగార్జున మాత్రం వారి రేంజ్ లో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్నాడు.

ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరో గా నటిస్తూనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ లో , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీ కి కమిట్ అయ్యి ఉన్నాడు. అలాగే బాబీ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆ తర్వాత గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో , అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ లో , బాబీ దర్శకత్వంలో మరో మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

ఇకపోతే నాగార్జున పోయిన సంవత్సరం సంక్రాంతికి "నా సామి రంగ" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన కూలి , కుబేర సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ఈయన సోలో హీరోగా ప్రస్తుతం ఏ సినిమాలో నటించడం లేదు. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. దానితో నాగర్జున అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: