తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే ఈ ముగ్గురు హీరోలు నటించిన సినిమాలు దాదాపు ఒకే సమయంలో విడుదల అవుతున్నాయి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఇకపోతే 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరో గా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరో గా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరో గా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూడు సినిమాలలో నరసింహ నాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవగా , దేవి పుత్రుడు సినిమా యావరేజ్ విజయాన్ని అందుకోగా , మృగరాజు సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరో గా రూపొందిన విశ్వంభర ,  బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజు , వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నట్లు మొదట అనౌన్స్మెంట్ లు వచ్చాయి. ఇక ఆ తర్వాత విశ్వంభర మూవీ సంక్రాంతి భారీ నుండి తప్పుకుంది.

బాలకృష్ణ హీరో గా రూపొందిన డాకు మహారాజ్ , వెంకటేష్ హీరో గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ సంవత్సరం సంక్రాంతి బారి లో నిలిచాయి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన మూవీలలో డాకు మహారాజ్ సినిమా మంచి విజయాన్ని అందుకోగా , సంక్రాంతికి వస్తున్నాం సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా 2001 వ సంవత్సరం సంక్రాంతి విన్నార్ గా బాలయ్య నిలిస్తే , 2025 వ సంవత్సరం సంక్రాంతి విన్నార్ గా వెంకటేష్ నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: