తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు తిరుగులేని స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇకపోతే చిరంజీవి స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే కొంత కాలం పాటు రాజకీయాలపై దృష్టి పెట్టి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి రాజకీయాల వైపు ఏ మాత్రం దృష్టి పెట్టకుండా కేవలం సినిమాల్లోనే నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఇక విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే చిరంజీవి వరుస పెట్టి సినిమాలను ఓకే చేస్తూ వెళుతున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను చిరంజీవి ఇప్పటికే చెప్పుకొచ్చాడు. ఈ మూవీ షూటింగ్ ఈ సంవత్సరం సమ్మర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు కూడా చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇకపోతే ఇప్పటికే తనకు వాల్టేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించిన బాబి కొల్లి దర్శకత్వంలో కూడా చిరు ఓ మూవీ చేయడం కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే ఏకంగా మూడు సినిమాలను చిరంజీవి ఓకే చేయడంతో ఆయన ఫ్యాన్స్ ఓ వైపు ఆనంద పడుతూనే , మరోవైపు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి వరుస పెట్టి సినిమాలను ఓకే చేస్తున్నందుకు మెగా ఫాన్స్ ఆనంద పడుతూనే , ఒక వేళ స్పీడ్ గా సినిమాలు చేయడం ద్వారా సినిమాల రిజల్ట్ ఏమైనా తేడా కొడుతుందా అనే విషయంలో వారు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: