
అయితే 15 ఏళ్లు తర్వాత మళ్లీ హీరో సూర్య తెలుగు సినిమా చేస్తున్నాడు. సూర్య ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వాహిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే వెంకీ అట్లూరి సార్, లక్కీ భాస్కర్ సినిమాలలో మంచి హిట్లను కొట్టాడు. ఇక ఇప్పుడు సూర్య తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మే నెలలో ప్రారంభం అవుతుందని.. వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.
సూర్య ప్రస్తుతం రెట్రో మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా ఈ ఏడాది వేసవి సెలవులో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ తమిళ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుందని టాక్ కూడా వినిమీపిస్తుంది. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి మరి.