టాలీవుడ్ హీరో బాలయ్య బాబు గురించి పరిచయం అనవసరం. బాలయ్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలం ఆయన నటించిన సినిమాలన్ని హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగింది. అయితే బాలకృష్ణ దర్శకుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మించారు. డాకు మహారాజ్ సినిమా థియేటర్ లో ఇటీవల విడుదల అయ్యింది. మంచి టాక్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ లుగా నటించారు.

ఇక సినిమా రిలీజ్ అవ్వగానే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన సినిమా ఎలా ఉందని స్వయంగా తన అభిమానులకు ఫోన్ కాల్ చేశారు. ఇక ఆయన కాల్ చేసి అభిమానులతో మాట్లాడిన ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా రెస్పాన్స్‌‌పై బాలయ్య బాబు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.  ఈ సినిమాలో నటించిన వైష్ణవిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అందరి దగ్గరనుండి మార్కులు కొట్టేసింది. అయితే ఈ పాప సినిమా సెట్స్ లో బాలకృష్ణను పట్టుకుని ఏడుస్తున్న వీడియో కూడా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 
డాకూ మహారాజ్ మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ప్రేక్షకులాంత ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గతంలోనే ఓటీటీలోకి వస్తుందని టాక్ వినిపించింది కానీ రాలేదు. అయితే తాజాగా డాకూ మహారాజ్ ఓటీటీలోకి వచ్చే డేట్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుందని స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: