నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ఇకపోతే బాలకృష్ణ కొంత కాలం క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిం దే . మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత మైన విజయాన్ని అందుకుంది . ఇకపో తే తా జాగా బాలకృష్ణ "డాకు మహారాజు" అనే సినిమా లో హీరో గా నటించా డు.

ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే అనిల్ రావిపూడి తాజాగా విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య "అఖండ 2" సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత మరో సారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక అనిల్ తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవి తో చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తో అనిల్ మూవీ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సంగీత దర్శకులలో ఒకరు అయినటువంటి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: