టాలీవుడ్ లో నాచురల్ బ్యూటీగా పేరుపొందిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ప్రేమమ్ చిత్రం ద్వారా  మొదటిసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో ఫిదా సినిమాలో నటించినది. ఈ సినిమాతో లేడీ క్వీన్ గా పేరు సంపాదించిన ఈ అమ్మడు ఆ తర్వాత మంచి మంచి పాత్రలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. తనకి పాత్ర నచ్చకపోతే ఎలాంటి ఈ హీరో అయినా సరే నో అని చెప్పేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మేకప్ వేసుకోవడం వంటివి కూడా ఎక్కువగా చేయదట.


ముఖ్యంగా సాయిపల్లవికి డాన్స్ ప్లస్ అని చెప్పవచ్చు. అమరన్, తండేల్ వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక సాయి పల్లవి సినిమా కెరియర్ గురించి కాకుండా తన పర్సనల్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ తనకు జాతీయ అవార్డు అందుకోవాలని చాలా కోరికగా ఉందని.. తన 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన అమ్మ ఒక చీర తనకి కొని ఇచ్చిందని పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పిందని తెలిపింది.


అయితే ఆ సమయంలో తాను ఇంకా సినిమాలలోకి రాలేదని అందుకే వివాహం చేసుకున్నాకే కట్టుకుందాం అనుకున్నారని తెలిపింది. ఆ తర్వాత మూడేళ్లకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను.. ప్రేమమ్ సినిమా కోసం పని చేస్తున్న సమయంలోనే తనకు ఏదో ఒక రోజు ప్రతిష్టాత్మకమైన అవార్డు వస్తుందని నమ్మకం కుదిరిందని.. అందుకే ఆ చీర అప్పుడు కట్టుకోవాలని అనుకున్నానని తెలియజేసింది జాతీయ అవార్డు అందుకోవడం కూడా చాలా గొప్ప విషయమని.. అందుకే ఆ చీర ధరించే వరకు తన మీద చాలా ఒత్తిడి ఉంటుందని వెల్లడించింది సాయి పల్లవి.. పెళ్లి అనేది తన జీవితంలో చాలా స్పెషల్ అని.. తనకు నచ్చిన వరుడు దొరికితే చేసుకుంటానని అయితే మరో రెండేళ్లు సమయం పడుతుందని వెల్లడించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న అభిమానులు సాయి పల్లవి డెడికేషన్ కి ఫిదా అవుతూ శభాష్ అంటూ ఈమెను పొగడ్తలతో మనం చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: