టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య తాజాగా తండెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు నిర్మించారు. ఈ మూవీ ని ఫిబ్రవరి 7 వ తేదిన తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమా అదిరిపోయే రేర్ మార్క్ కలెక్షన్ ను టచ్ చేసింది.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం  ఈ సినిమాకు ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ వీకెండ్ పూర్తి అయ్యే లోపు ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేయడం కన్ఫామ్ గా కనబడుతుంది. దానితో గత కొన్ని రోజులుగా వరుస ఆపజాయాను ఎదుర్కొంటూ వస్తున్న నాగ చైతన్య కు తండెల్ మూవీ తో అద్భుతమైన విజయం దక్కడం , ఈ సినిమా 100 కోట్ల రేర్ మార్ కలెక్షన్లను టచ్ చేయడంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో నాగ చైతన్య , సాయి పల్లవి నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc