తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో నితిన్ ఒకరు. ఈయన జయం అనే మూవీ తో హీరోగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించినా నితిన్ ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఆఖరుగా ఈయన నటించిన రెండు సినిమాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కొంత కాలం క్రితం ఈయన మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆఖరుగా ఈయన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇది ఇలా ఉంటే నితిన్ తన కెరియర్ లో ఓ రెండు బ్లాక్ బాస్టర్ మూవీలను వదులుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం రామ్ పోతినేని హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రెడీ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మొదట శ్రీను వైట్ల , నితిన్ ను హీరోగా అనుకున్నాడట. కానీ నితిన్ ఆ సినిమాను రిజెక్ట్ చేయడంతో రామ్ తో ఆ మూవీ ని రూపొందించాడట. ఇక అనిల్ రావిపూడి కొంత కాలం క్రితం రవితేజ హీరో గా రాజా ది గ్రేట్ మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనిల్ మొదటగా నితిన్ ను హీరో గా అనుకున్నాడట. కానీ ఆయన ఆ సినిమాను రిజెక్ట్ చేయడంతో అందులో అనిల్ ఆ మూవీలో రవితేజ ను హీరో గా తీసుకున్నాడట. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇలా నితిన్ ఈ రెండు బ్లాక్ బాస్టర్ మూవీలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: