మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అదిరిపోయే జోష్ లో కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు. తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా చరణ్ కెరియర్లో 16 వ మూవీగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ ని ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ మూవీ చరణ్ కెరియర్ లో 17 వ మూవీ గా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే తాజాగా చరణ్ 18 వ మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ఆ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు అయినటువంటి నిఖిల్ నాగేష్ బట్ దర్శకత్వం వహించబోతున్నాడు అని ఇప్పటికే నిఖిల్ , చరణ్ కి ఓ కథను వివరించగా ఆ కథ బాగా నచ్చడంతో చరణ్ ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ఓ వార్త వైరల్ అయింది.

ఇక ఇప్పటికే ఈయన దర్శకత్వం వహించిన కిల్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఉండడంతో అలాంటి దర్శకుడితో చరణ్ సినిమా ఓకే చేసుకున్నాడు అని వార్తలు రావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారంట. ఇక తాజాగా నిఖిల్ స్పందిస్తూ ... నేను చరణ్ తో సినిమా చేయడం లేదు. నేను ప్రస్తుతం నా నెక్స్ట్ మూవీ కోసం కథ తయారు చేస్తున్నాను. కథ మొత్తం తయారు అయిన తర్వాత నా నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ప్రకటనను విడుదల చేస్తాను అని నిఖిల్ ప్రకటించాడు. దీనితో మెగా ఫాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: