టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య తాజాగా తండెల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోస్ట్ టాలెంటెడ్ నటీమణి సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడిగా నటించింది. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీలోని చైతూ , సాయి పల్లవి నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంశాలు దక్కుతున్నాయి. ఈ మూవీ ని తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో ఫిబ్రవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ ఓపెనింగ్స్ లభించాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మీడియం హీరోల సినిమాలలో తండెల్ మూవీ అద్భుతమైన స్థానంలో నిలిచింది.

విడుదల అయిన 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మీడియం రేంజ్ హీరోల సినిమాలలో హనుమాన్ సినిమా 4.75 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , గీత గోవిందం సినిమా 3.25 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక కార్తికేయ 2 మూవీ 1.82 కోట్ల కలెక్షన్లతో 3 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా , నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్గా రూపొందిన తండెల్ మూవీ 1.77 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc