
కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. దిల్ రాజు తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టనంత ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ సినిమాను నిర్మించడం విశేషం.
కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. నష్టాల వైపుకు దూసు కుపోయింది. గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ప్రతి ఒక్కరు నిరాశలో ఉన్నారు. విడుదలైన మొదటి రోజే యావరేజ్ తెచ్చుకోగా ఈ సినిమా పై పెద్దగా అభిమానులు ఆసక్తిని చూపించలేకపోయారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్లు గా కియారా అద్వానీ, అంజలి నటించారు.
అయితే ఈ సినిమా లో వీరు నటించినప్పటికీ ఈ హీరోయిన్లకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమా అనంతరం కియారా అద్వానీకి అంజలికి తెలుగులో సినిమా అవకాశాలు వస్తాయో రావు అనే సందేహంలో చాలామంది ఉన్నారు. మరి వీరికి తెలుగులో ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదో అని అభిమానులు అనుకుంటున్నారు.