తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాను దర్శకత్వం వహించే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్ అట్లీ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేయాలని చాలా కాలం నుంచి ప్లాన్ లో ఉన్నారట. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో తనదైన మార్క్ చూపించిన అట్లీ ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమాని తీయాలని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.


అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బ్లాక్ బస్టర్ రికార్డులను తిరగరాశాడు. దీంతో అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు అనుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో సినిమా అనే చర్చ చాలా కాలం నుంచి నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.


అయితే వీరిద్దరి కాంబినేషన్లో తీయబోయే సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మొదట అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారట. కానీ ఆమె కేవలం హీరోయిన్ గా చేయాలని ఫిక్స్ అయ్యారట.


ఐటమ్ సాంగ్ లో చేయనని చెప్పారట. అనంతరం ఆమె స్థానంలో యంగ్ బ్యూటీ శ్రీ లీలను పెట్టి పాటను తీశారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా చేసే అవకాశం బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కు దక్కింది. వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: