మెగాస్టార్ చిరంజీవికి 2001వ సంవత్సరం అంతగా కలిసి రాలేదు..అదే సంవత్సరం ఆయన నటించిన ‘మృగరాజు’ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు.అలాగే చిరంజీవి శివుడిగా నటించిన ‘శ్రీమంజునాథ’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేదు.అయితే అదే సంవత్సరం చిరూ నటించిన ‘డాడీ’ కూడా విడుదల అయింది.. ఆ సినిమా నటునిగా చిరంజీవికి మంచి మార్కులు తెచ్చి పెట్టింది. ఈ చిత్రంలోనే అల్లు అర్జున్ తొలిసారి తెరపై కనిపించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. 2001 అక్టోబర్ 4న ‘డాడీ’ సినిమా రిలీజ్ అయింది..

అద్భుతమైన కథ కూతురు సెంటిమెంట్ ఇలా ఎన్నో ఆకట్టుకునే అంశాలతో దర్శకుడు సురేష్ కృష్ణసినిమా ను తెరకెక్కించారు.. ఎస్.ఏ.రాజ్ కుమార్ అందించిన మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది..ఈ చిత్రంలో చిరంజీవి రాజ్ గా, సిమ్రాన్ శాంతిగా..అక్షయ, ఐశ్వర్య పాత్రల్లో చిన్నారి అనుష్క మల్‌హోత్ర అద్భుతంగా నటించారు..‘డాడీ’ చిత్రం విడుదలయిన రోజునే ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది..అదే ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన చిరంజీవి ‘మృగరాజు’ తీవ్రంగా నిరాశపరిచింది.

దాంతో మంచి టాక్ తెచ్చుకున్న ‘డాడీ’ సినిమాని అభిమానులు విపరీతంగా చూశారు. 97 కేంద్రాలలో ఈ సినిమా అర్ధశతదినోత్సవం జరుపుకుంది. అయితే తరువాత నుంచీ రష్ బాగా తగ్గింది.కేవలం 15 కేంద్రాలలోనే ఈ సినిమా వంద రోజులు ఆడింది.. దీనితో ఓవరాల్ గా ”డాడీ” సినిమా యావరేజ్ గా నిలిచింది..మెగాస్టార్ ఈ సినిమాలో తండ్రిగా అద్భుతంగా నటించారు.. కానీ ఆయన వేరే వ్యక్తీ చేతిలో మోసపోవడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.. అప్పటివరకు మాస్ సినిమాలు చేసిన చిరంజీవి అలాంటి ఎమోషనల్ పాత్ర చేయడంతో ప్రేక్షకులకు అంతగా రిసీవ్ చేసుకోలేద.. కానీ ఆ సినిమాలో చిరు నటనకు కన్నీరు పెట్టని ప్రేక్షకుడు అంటూ ఎవరు లేరని చెప్పాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: