టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఇటీవలే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హిట్ సీక్వెల్స్ లలో  ఒకటైన ఆషికి-3 లో హీరోయిన్గా నటించినందుకు అవకాశం వచ్చింది.ఇందులో హీరోగా కార్తీక్ ఆర్య కి జోడిగా నటిస్తున్నది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రాన్ని అనురాగ్ బసు తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ వీరందరినీ కాదని శ్రీలీల ను ఈ పాత్రకి ఎంపిక చేయడం జరిగిందట. ముఖ్యంగా పుష్ప-2 చిత్రంలోని కిసిక్ పాటతో ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నది.



అందుకే ఇప్పుడు హీరోయిన్ గా ప్రమోట్ అవ్వడం కోసం సిద్ధంగా ఉన్నది. ఇప్పటివరకు శ్రీ లీల ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించినట్లు కనిపించలేదు. తెలుగు చిత్రాలు కాబట్టి ఆ అవకాశాలు అయితే ఎక్కడ రాలేకపోవచ్చు. కానీ శ్రీ లీల లిప్ లాక్ బికినీలు ఇంటిమేట్ సీన్లు వంటివి ఇప్పటివరకు చేసింది ఎక్కడ లేదు. అయితే ఆషికి 3 చిత్రంలో రొమాంటిక్ స్టోరీ కాబట్టి ఈ చిత్రంలో లవ్ స్టోరీ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ని ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటాయి.


అయితే ఈ సినిమా లెక్కలో ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఇంటిమెంటు సీన్స్ ఉంటాయనే విధంగా  బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా హీరో కార్తీ ఆర్యతో పాటు శ్రీలీల అలాంటి సన్నివేశాలలో నటించడానికి సిద్ధమైనట్లుగా ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది.. ప్రేమతో చాలా ఘడతను చూపించే క్రమంలోనే డైరెక్టర్లు సహజంగా ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉంటారు. మరి శ్రీ లీల నిజంగానే ఇందులో ఇంటిమేట్ సన్నివేశాలలో నటిస్తోందా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఇటీవల ఫస్ట్ గ్లింప్ టిజర్ లో కొన్ని కిస్సింగ్ సన్నివేశాలకు సంబంధించి  వైరల్ గా మారుతూ ఉన్నాయి. మరి ఆషికి 3 ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: